హైదరాబాద్, మార్చి 16: పీజు రియింబర్స్‌మెంట్‌లో మంత్రి జగదీష్ రెడ్డి 5 శాతం ముడుపులు తీసుకున్నారని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పునరుద్ఘాటించారు. ఈ ముడుపుల వ్యవహారంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి మధ్యవర్తిగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు. మంత్రి అవినీతిపై ఆధారాలతో సహా లోకాయుక్తకు ఫిర్యాదుచేశామని పొన్నం చెప్పారు. ఈ అంశమై సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అవినీతికి పాల్పడ్డ జగదీష్ రెడ్డిని వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముడుపులు చెల్లించినందుకే పల్లాకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారని ఆయన ఆరోపించారు.
మంత్రి జగదీష్‌కు ముడుపులు చెల్లించినందుకే పల్లాకు ఎమ్మెల్సీ టికెట్





