Wednesday, 4 November 2026

23,000/- రూపాయల జరిమాన

 

 

 

 

 

:- ప్రమాదాల నివారణ లక్ష్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు
నల్గొండటౌన్, జనంసాక్షి:(జూన్ 05): మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమానాలతో పాటు జైలు శిక్ష తప్పదని ట్రాఫిక్ సిఐ చీర్ల శ్రీను హెచ్చరించారు.సోమవారం నాడు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 16 మందిలో ముగ్గురు వ్యక్తులకు మూడు రోజుల జైలు , జరిమానా మరియు మిగిలిన 13 మంది వ్యక్తులకు జరిమానా విధించారని వివరించారు. మొత్తం 16 మందికి గాను 23,000/- రూపాయల జరిమాన విధించారని ఆయన తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా క్రమం తప్పకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలను నిర్వహించడంతో పాటు రోడ్డు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీఐతో పాటు, ట్రాఫిక్ సిబ్బంది ఉన్నారు.