Wednesday, 4 November 2026

ప్రపంచ పర్యావరణ దినోత్సవ

 

 

 

 

:-  పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
:- సామాజిక ఉద్యమకారులు డాక్టర్ వేమూరి సత్యనారాయణ

మునగాల, జూన్ 5(జనంసాక్షి): మునగాల మండల పరిధిలోని నరసింహాపురం గ్రామానికి చెందిన సామాజిక ఉద్యమకారులు డాక్టర్ వేమూరి సత్యనారాయణ సోమవారం తన పుట్టినరోజు, ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా తన నివాసంలో మూడు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని, ప్రతి ఒక్కరూ తమ తమ పుట్టినరోజులు వివాహ వార్షికోత్సవాలు తదితర సమయాలలో మొక్కలు నాటి మిగిలిన వారికి ఆదర్శంగా నిలవాలని, అదేవిధంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత కూడా తీసుకోవాలని, జనాభా పెరగటం వల్ల అధిక వాహనాల వినియోగం పెరుగుతుందని, దాని ద్వారా వాయు కాలుష్యం పెరగటం వల్ల మనిషి యొక్క ప్రాణవాయువు తగ్గిపోతుందని, ప్రతి ఒక్కరికి తగిన ఆక్సిజన్ అందక వివిధ రోగాల బారిన పడుతున్నారని అన్నారు. అందుకే పర్యావరణాన్ని కాపాడుదాం ప్రకృతి వినాశనాన్ని అడ్డుకుందాం, చెట్లు దేశ ప్రగతికి మెట్లు అని నినదించారు. మన కోసమే కాదు మన బావి భారత పిల్లల భవిష్యత్తు కోసం పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత మనపై ఉందని, అందుకే ప్రతి ఒక్కరం విధిగా మొక్కలు నాటుదాం ఊరంతా పచ్చదనం నింపుదామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు బొమ్మ చిన్న వెంకన్న, అల్లి చిన్నరామయ్య, బారి లక్ష్మయ్య, చెరువుపల్లి లింగయ్య, షేక్ బాబా తదితరులు పాల్గొన్నారు.