Tuesday, 3 November 2026

నియోజకవర్గ ప్రజలకు పాలేరుగా సేవలందిస్తా….   

 

కాంగ్రెస్ పార్టీ తరపున టికెట్ కేటాయించాలని రాయపురం సాంబయ్య అభ్యర్థన

 

కేసముద్రం-సెప్టెంబర్ 2- జనం సాక్షి : ఏఐసీసీ పిలుపుమేరకు కాంగ్రెస్ పార్టీ తరఫున మహబూబాబాద్ నియోజకవర్గ అభ్యర్థిగా గాంధీభవన్లో దరఖాస్తు చేసుకున్న తనకు టికెట్ కేటాయిస్తే నియోజకవర్గ ప్రజలకు పాలకునిగా కాకుండా సేవకునిగా,పాలేరుగా సేవలందిస్తానని రాయపురం సాంబయ్య అన్నారు.శనివారం కేసముద్రం మండలం కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం ఆయన మాట్లాడుతూ…కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు ముగ్ధుడనై గత 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ తరఫున గ్రామ,మండల పార్టీ అధ్యక్షునిగా సేవలందిస్తూ ఉన్న తనను మహబూబాబాద్ నియోజకవర్గ అభ్యర్థిగా టికెట్ ను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కేటాయిస్తే బడుగు బలహీన వర్గాలకు నిస్వార్ధంగా సేవలందిస్తానని తెలియజేశారు.