వైయస్ రాజశేఖర్ రెడ్డి అందించిన సేవలు మరువలేని.
కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్.
రాజన్న సిరిసిల్ల బ్యూరో. సెప్టెంబర్ 2. (జనంసాక్షి). డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అందించిన సేవలు మరువలేనివని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్ అన్నారు. శనివారం డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా గాంధీ చౌరస్తా వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చొప్పదండి ప్రకాష్, కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసిన వైఎస్ సేవలు మరువలేనివాని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కి ఆయన అందించిన సేవలను కొనియాడారు. ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని తెలిపారు. కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఆకునూరు బాలరాజు, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కామిని వనిత, టోనీ, న్యాయవాది చౌటపల్లి వేణుగోపాల్,మునిగల రాజు, భరత్, పలువురు కాంగ్రెస్ పార్టీ , అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు