30 సంవత్సరాలుగా తాండూర్ అభివృద్ధికి మంత్రి అనేక సేవలు.  

మంత్రి పట్నం మహేందర్ రెడ్డికి శుభాకాంక్షలు.
మార్కెట్ కమిటీ చైర్మన్ విట్టల్ నాయక్.
తాండూరు సెప్టెంబర్ 2(జనంసాక్షి)మంత్రి డాక్టర్ పి మహేందర్ రెడ్డి కి తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విట్టల్ నాయక్ శుభాకాంక్షలు తెలిపారు. శనివారం హైదరాబాద్లో రాష్ట్ర పౌర సరఫరాల గనులు భూగర్భ శాఖ మంత్రి డాక్టర్ పి మహేందర్ రెడ్డి నీ మార్కెట్ కమిటీ చైర్మన్ విట్టల్ నాయక్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ విట్టల్ నాయక్ మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి మహేందర్ రెడ్డి అనేక నిధులు తీసుకువచ్చి ఎనలేని కృషి చేశారని కొన్ని ఆడారు. ఇకముందు స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మంత్రి మహేందర్ రెడ్డి సహకారంతో తాండూరు అభివృద్ధికి మరింత కృషి చేస్తారని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మహేందర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో యాలాల ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా, కమల్పూర్ మాజీ సర్పంచ్ వెంకట్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ అనంతయ్య ముదిరాజ్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.

తాజావార్తలు