నేషనల్ లోక్ అధాలత్ సద్వినియోగం చేసుకోవాలి:గూడూరు ఎస్ ఐ రాణా ప్రతాప్

కొత్తగూడ సెప్టెంబర్ 2 జనంసాక్షి:మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాణా ప్రతాప్ మాట్లాడుతూ స్థానిక ప్రజలకు మంచి అవకాశం….గతంలో నమోదు అయిన పోలీస్,కోర్టు కేసులు రాజి చేసుకునేందుకు అవకాశం వచ్చిందని అన్నారు.రాజీ చేసుకునే ఇరు వర్గాలు ఈ నెల 09 వరకు పోలీసు స్టేషన్‌కి హాజరైనట్లయితే వారిని కోర్టులో ప్రవేశపెట్టి ఆ కేసును పూర్తిగా క్లోజ్ చేయించడం జరుగుతుందని తెలిపారు.యాక్సిడెంట్ కేసులు,వ్యక్తుల ఘర్షణ కేసులు,చీటింగ్ కేసులు,చిట్ పన్డ్ కేసులు,భూతగాదాల కేసులు,వివాహ బంధానికి సంబంధించిన కేసులు,చిన్నచిన్న దొంగతనం కేసులు,అక్రమ రవాణా (ఇసుక,మట్టి,కట్టెలు,మద్యం),పేకాట కేసులు,లాక్‌డౌన్ కేసులు మొదలైనవి.ఈ లోకదాలత్ లో రాజీ చేసుకుని పూర్తిగా క్లోజ్ చేసుకునే అవకాశం ఉంది.ఈ అవకాశాన్ని కేసులు ఉన్న ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.దీని కోసం ఫిర్యాదుదారుడు,నేరస్తుడు ఇద్దరు తమ యొక్క ఆధార్ కార్డులను తీసుకుని పోలీసు స్టేషన్‌కి లేదా జె ఎఫ్ సి ఎం మహబూబాాద్ కోర్ట్ కు రావాలని కోరారు.మరి ఇతర సమాచారం కొరకైన ఈ పోలీస్ స్టేషన్ నెంబర్ 8712656963,రమేష్ కోర్టు పోలీస్ 9603154256 నెంబర్ ను సంప్రదించాలని కోరారు.

తాజావార్తలు