ఘనంగా మహా నేత వైఎస్సార్ వర్థంతి వేడుకలు

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అల్లం నాగేశ్వర్ రావు ఆధ్వర్యంలో

కేసముద్రం-సెప్టెంబర్ 2-జనం సాక్షి : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వ నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ రాష్ట్రమంతా పాదయాత్ర చేసి ప్రజా సమస్యలను,రైతుల కష్టాలను చూసి చలించిపోయి ప్రభుత్వం ఏర్పడ్డాక రైతుల కష్టాలను తీరుస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఆదర్శవంతమైన గొప్ప నాయకుడు వైయస్సార్ అని కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అల్లం నాగేశ్వరరావు అన్నారు.శనివారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి ని పురస్కరించుకొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైయస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేదలకు విద్య,వైద్యం అందాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్యాన్ని అందించారనీ తెలిపారు.నిరుపేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవాలని ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తూ,ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన వైఎస్సార్ రెండు రాష్ట్రాల ప్రజల మనసులలో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు.వైయస్సార్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా నాగేశ్వరరావు కోరారు.
ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు దసురు నాయక్,మాజీ మండల అధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి,దన్నసరి ఉప భానోత్ వెంకన్న, పట్టణ అధ్యక్షుడు రావుల మురళి,సుధాకర్, విక్కి,శ్రీను,జలెందర్,శ్రీనివాస్ రెడ్డీ,శంకర్,చిట్ల సంపత్,రాంబాబు,నరేశ్,యువజన కాంగ్రెస్ మహబూబ్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు అల్లం గణేష్ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు