తాండూర్ పట్టణంలో నిర్వహించే ర్యాలీని విజయవంతం చేయండి.

బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఎం.ఎ
నయీం అఫు.
తాండూరు సెప్టెంబర్ 2 (జనం సాక్షి) తాండూరు పట్టణంలో ఆదివారం నిర్వహించి ర్యాలీని విజయవంతం చేయాలని బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఎంఏ నయీం అప్పు పేర్కొన్నారు. శనివారం ఆయన ఓ ప్రకటన ద్వారా తెలిపారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఎం.ఎ నయీం అఫు మాట్లాడుతూ మంత్రి మహేందర్ రెడ్డి మంత్రి గా బాధ్యతలు చేపట్టి మొదటిసారిగా తాండూర్ పట్టణానికి విచ్చేస్తున్న శుభ సందర్భంగా భారీ ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
మంత్రి మహేందర్ రెడ్డి తో పాటు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కూడా హాజరవుతున్నట్లు తెలిపారు.తాండూర్ పట్టణంలో గల విలియమూన్ చౌరస్తా నుండి రైల్వే స్టేషన్ రోడ్డు వైపుగా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యకర్తలను అభిమానులను దృష్టిలో ఉంచుకొని మధ్యాహ్నం రెండు గంటలకు ప్రభుత్వ జూనియర్ కళాశాల మీద భోజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

తాజావార్తలు