ధర్మపురి పట్టణ కేంద్రంలో కాంగ్రెస్
టికెట్ ఆశా వహులు గజ్జల స్వామి గడపగడపకు ప్రచారం*

ధర్మపురి (జనం సాక్షి)పట్టణ కేంద్రంలో గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమాన్ని శనివారము మండల కేంద్రంలో ధర్మపురి టికెట్ ఆశా వ హులు లైన, గజ్జల స్వామి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసిన గజ్జల స్వామి, పార్టీ నాయకులు అభిమానులతో కలిసి గజ్జల స్వామి తన ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గడప గడపకు ప్రచారం చేస్తూ, గతంలో కాంగ్రెస్ హయాంలో చేసిన అభివృద్ధి పథకాలను వివరించడంతోపాటు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చడమే మా పార్టీ యొక్క లక్ష్యమని, తదనంతరం గజ్జల స్వామి మీడియా ముఖంగా మాట్లాడుతూ, కొప్పుల ఈశ్వర్ ను ధర్మపురి నియోజకవర్గ ప్రజలు పూర్తి మెజార్టీ ఇచ్చి 2009లో గెలిపిస్తే ధరంపురి పట్టణ కేంద్రం ఈనాటి వరకు ఒక పల్లెటూరు, మాదిరిగానే ఉన్నదని, నాణ్యత లేని రోడ్లు, కూరగాయల మార్కెట్ రైతులు కూర్చొని కూరగాయల అమ్మే విధంగా లేదని, ఈ ధర్మపురి పట్టణాన్ని అభివృద్ధిలో కొనసాగించలేదని, ఆయన స్థానికుడు కాదు కాబట్టి అందుకే ధర్మపురికి, 500 కోట్లు పార్టీ నుంచి వచ్చినప్పటికీ, పట్టణ కేంద్రంలో ఎక్కడ కూడా సెంటర్ లైటింగ్ లేదంటూ ఆయన సూచించారు, నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశారని కొప్పుల ఈశ్వర్ ప్రజలను ఓటు అడుగుతారని గజ్జల స్వామి ప్రశ్నించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మున్సిపల్ కౌన్సిలర్లు అభిమానులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

తాజావార్తలు