ముదిరాజ్ లను చిన్న చూపు చూస్తున్న తెలంగాణ ప్రభుత్వం

జనంసాక్షి, మంథని : తెలంగాణలో జరిగే శాసనసభ ఎన్నికల కోసం బిఆర్ఎస్ పార్టీ నుండి 105 మంది అభ్యర్థులను ప్రకటించిన కెసిఆర్ కు 65 లక్షల మంది అంటే దాదాపు 15 శాతం తెలంగాణ లో అధ్యధిక జనాభా కలిగిన ముదిరాజ్ కులానికి చెందిన ఒక్క బిడ్డా కూడా కనిపించక పోవడం కెసిఆర్ అహంకార ధోరణికి నిదర్శనం అని జిల్లా ముదిరాజ్ మహాసభ యువత అధ్యక్షులు పోతరవేణి క్రాంతి, మండల అధ్యక్షులు గుండా రాజు అన్నారు. శనివారం మంథని ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… తెలంగాణ ఉద్యమ సమయంలో మా ముదిరాజ్ సోదరులు వలలు తోపెళ్ల తోని మా ముదిరాజ్ ఆడబిడ్డలు నెత్తిన బోనాలు ఎత్తుకొని ఎండనక వాననక తెలంగాణ సాధన పోరాటంలో ముఖ్యభూమిక పోషించిన విషయం మరచిపోయివా కెసిఆర్ . ? అని ప్రశ్నించారు.ఆనాడు నీతో వెన్ను దన్నుగా ఉండి తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన ముదిరాజ్ బిడ్డా అయిన ఈటెల రాజేందర్ కి ప్రజల్లో మంచి పేరు వస్తుందని అతను ఎక్కడ ఎదిగి పోతాడో అని ముదిరాజ్ కులంలో ఉన్న ఒకే ఒక్క ఎమ్మేల్యే ను ఎన్నో అవమానాలకు గురిచేసి అక్రమ కేసులు పెట్టి నీ పార్టీ నుండి వెళ్లగొట్టినవ్..అంటే ముదిరాజ్ లు నీకు ఎప్పుడు ఓట్లు వేసి గెలిపించాల్సిందే కానీ రాజ్యాధికారం చేపట్టడానికి అనర్హులు అనే నీ దొర అహంకార పాలన ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుంది? ఎన్నికలు సమయం దగ్గర కావడం దళిత బంధు అని బిసి బంధు అని తెలంగాణ ప్రజలను మభ్యపెడుతుంటివి..ఆ బిసి బంధులో ముదిరాజ్ లకు చోటే లేదు..ఎందుకు పెట్టలేదు అని అడిగితే ముదిరాజ్ లకు చేప పిల్లలు బండ్లు వ్యాన్లు ఇస్తున్న అంటివి ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద ఇస్తున్న పథకం..మత్స్యశాఖ లో ఒక్క ముదిరాజ్ లే ఉండరు కెసిఆర్ అందులో మా దళిత సోదరులు బెస్త సోదరులు అందరూ ఉంటారు..కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చే పథకాన్ని నువ్వు ఇస్తున్నట్లుగా తెలంగాణ ముదిరాజ్ సోదరులను మోసం చేస్తున్నారు..అంటే ముదిరాజ్ లకు రాష్ట్ర ప్రభుత్వం చేసింది శూన్యం..
ఈరోజు తెలంగాణ ఎమ్మెల్యే సీట్లల్లో మాకు చోటు లేదూ బిసి బందులో చోటులేదు 65 లక్షలు ఉన్న ముదిరాజ్ లకు ఒక ప్రత్యేకమైన కార్పొరేషన్ లేదు అంటే ముదిరాజ్ లు ఓట్లు వేయాలి మిమ్మల్నీ గెలిపించాలని అంతే కదా కెసిఆర్?? ముదిరాజ్ లను ఇంత చిన్న చూపు చూస్తూ నిర్లక్ష్యం వహిస్తున్న నీకు తగిన బుద్ది చెప్తాము ఈ కార్యక్రమంలో ముదిరాజ్ నాయకులు సబ్బని సమ్మయ్య, పోలు శివ,నరెడ్ల కిరణ్,వీరబోయిన రాజేందర్,పోతరవేని నడిపి రాజు,జెట్టి చందు,జెట్టి శంకర్,బండారి ప్రసాద్, సబ్బాని రాజేష్ లు పాల్గొన్నారు.

తాజావార్తలు