Wednesday, 4 November 2026

డబ్ల్యూ టి ఐ టి సి సహాయ కార్యదర్శిగా రమేష్ అనుపటి.

నాగర్ కర్నూల్ బ్యూరో, జనంసాక్షి:

ఐటీ రంగంలో విశిష్ట సామర్థ్యాన్ని నిరంతర శ్రమ తత్వాన్ని సేవా భావాన్ని గుర్తించిన డబ్ల్యూటిఐటిసి సహాయ కార్యదర్శిగా రమేష్ అనుపటిని నియమించినట్లు ఆయన శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.ఇటీవల 33 దేశాల ప్రతినిధుల సమక్షంలో బెస్ట్ టెక్ ఇన్సిట్యూట్ ఎక్సలెన్సీ అవార్డును అందుకోవడం జరిగిందని వివరించారు.నిరంతర శ్రమ సామర్థ్యం ఉంటే సులభంగా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు అని ఆయన వివరించారు.తన సేవాభావాన్ని గుర్తించి నియామకం జరపడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు ఎలాంటి బాధ్యతలు లేకుండానే సుమారు 2000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందని రాబోయే రోజులలో సంస్థ సహకారంతో పేద మధ్యతరగతి విద్యార్థులకు శిక్షణ ఇవ్వడంతో పాటు ఉపాధి అవకాశాలను కల్పిస్తానని ఆయన తెలిపారు. డబ్ల్యుటిఐటిసి బృందానికి ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు