పేదింటి అమ్మాయి పెళ్లికి లైన్స్ క్లబ్ ఆర్థిక సహాయం

జనంసాక్షి, రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పేదింటి అమ్మాయి పెళ్ళికి సభ్యులందరికీ కలిసి తమకు తోచిన విధంగా శనివారం ఆర్థిక సాయం చేశారు. రత్నాపూర్ గ్రామానికి చెందిన కాదాసు రాజేశ్వరి కూతురు వివాహం కు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని సర్పంచ్ పల్లె ప్రతిమ పీవీరావు లైన్స్ క్లబ్ సభ్యుల దృష్టికి రావడం జరిగింది. దీనికి స్పందించిన క్లబ్ అధ్యక్షుడు మోలుమురి.శ్రీనివాస్ ఆధ్వర్యంలో సర్పంచ్ పల్లె ప్రతిమ పీవీరావు రూ.2000/-, ఆర్జీ-3 ఎఫ్ ఏ మేనేజర్ గడ్డం శ్రవణ్ కుమార్ మట్టేల్, 50 కిలోల బియ్యం, ఉప సర్పంచ్ దుబ్బాక సత్యరెడ్డి, ప్రగతి పాఠశాల కరస్పాండెంట్ అబ్బు కేశవ రెడ్డి 50 కిలో ల బియ్యం, కన్నూరి శ్రీశైలం, పున్నం మాధుకర్ రెడ్డి 10 కిలోల కంది పప్పు,దొడ్ల శ్రీనివాస్ 15 కిలోల ఆయిల్, సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ ఇనుగాల లక్ష్మీ నారాయణ 10 కిలోల పెరుగు ఇవ్వడం జరిగింది. మొత్తం రూ.12 వేల విలువ చేసే సామను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ గంట వెంకట రమణ రెడ్డి,సర్పంచ్ పల్లె ప్రతిమ పీవీరావు, డాక్టర్. మేకల. శరణ్య, తీగల శ్రీధర్,తొట్ల రాజ్,మన్నల రాహుల్,బెజ్జల తిరుపతి, బెజ్జల రాజేందర్, బెజ్జల ఓం ప్రకాష్,ఓరం అనిల్,బెజ్జల సుందర్,బెజ్జల కుమార్ పాల్గొన్నారు.

తాజావార్తలు