ప్రభుత్వ సన్నాహాలను స్వాగతిస్తున్నాం

… టీఎస్ యుటిఎఫ్ బచ్చన్నపేట మండల అధ్యక్షులు.. మాడిశెట్టి కృష్ణమూర్తి

బచ్చన్నపేట( జనం సాక్షి) సెప్టెంబర్ 2  ఉపాధ్యాయుల ఉద్యోగన్నతి, బదిలీల షెడ్యూల్పై ఏడు నెల లుగా కొనసాగుతున్న స్టే హైకోర్టు ఎత్తివేయ డాన్ని టీఎస్ యుటిఎఫ్ సంఘం స్వాగతిస్తున్నదని బచ్చన్నపేట టీఎస్ యు టి ఎఫ్ మండల అధ్యక్షులు మాడిశెట్టి కృష్ణమూర్తి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ. 8 ఏళ్లుగా పదోన్నతి . ఐదేండ్లుగా బది లీలు ప్రక్రియ చేపట్టకపోవడంతో వేలాది ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వం బదిలీలు, ఉద్యోగన్నతి షెడ్యూల్ విడుదలకు సన్నాహాలు చేస్తున్న దరిమిలా సాధిస్తున్నామన్నారు . సకాలంలో ప్రక్రియ పూర్తి చేసి ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడడానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు

తాజావార్తలు