పొడిచేడులో ఘనంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి వేడుకలు

మోత్కూరు సెప్టెంబర్ 2 జనం సాక్షి : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను, రైతుల కష్టాలను చూసి చలించిపోయి ప్రభుత్వం ఏర్పడ్డాక రైతుల కష్టాలను తీరుస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఆదర్శవంతమైన గొప్ప నాయకుడు వైఎస్సార్ అని పొడిచేడు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు జిట్ట అంజయ్య అన్నారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వంగాల సత్యనారాయణ ఆదేశాల మేరకు శనివారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి ని పురస్కరించుకొని పొడిచేడు లో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాలులర్పించారు. ఈ సందర్భంగా జిట్ట అంజయ్య మాట్లాడుతూ వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేదలకు విద్య,వైద్యం అందాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్యాన్ని అందించారనీ తెలిపారు. నిరుపేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవాలని ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తూ,ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన వైఎస్సార్ రెండు రాష్ట్రాల ప్రజల మనసులలో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. వైఎస్సార్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ చిందాల ఎల్లయ్య, నాయకులు నాతి ఎల్లయ్య, కాసరబాద లచ్చయ్య, జిట్ట పెద్ద నర్సయ్య, జిట్ట నర్సయ్య,బందెల నర్సయ్య,నల్ల రామనర్సయ్య, జిట్ట సైదులు, రచ్చ భానుచందు, బందెల పరుశురాములు, ఎర్ర చంద్రయ్య,జిట్ట నర్సయ్య, జిట్ట వెంకటేశ్వర్లు, జిట్ట యోగేందర్,జిట్ట సైదులు, జిట్ట లోకేష్ వంగాల కొండయ్య తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు