రేషన్ బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం

జనం సాక్షి దుబ్బాక
దుబ్బాక మండలంలోని పద్మ నాభూని పల్లి గ్రామంలో రేషన్ బియ్యం లో ప్లాస్టిక్ బియ్యం కలకలం రేపింది. గ్రామానికి చెందిన కండ్లకొయ్య రవీందర్ గ్రామం లోని రేషన్ షాప్ లో బియ్యన్ని తీసుకున్నారు. తీసుకున్న రేషన్ బియ్యాన్ని చూసి అనుమానం వచ్చిన ఆయన అగ్గిపుల్లతో కాలిస్తే ప్లాస్టిక్ ముద్ద వలె దగ్గరికి వస్తుందని అన్నారు.అయితే ఫార్టీఫైడ్ రైస ప్లాస్టిక్ బియ్యమా తేలాల్సి ఉంది. రేషన్ బియ్యంలో సైతం ప్లాస్టిక్ బియ్యం రావడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాటిని తినడం వల్ల ప్రజలు అనారోగ్యాల పాలవడం తప్పదని అంటున్నారు. దీనిపై సంబంధిత అధికారులు దృష్టి సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని లేకుంటే గ్రామ ప్రజలు రేషన్ బియ్యం తీసుకోవడానికి భయబ్రాంతులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని అన్నారు

తాజావార్తలు