శ్రీ తిమ్మప్పస్వామి దేవాలయంలో గంప జాతర
మల్దకల్ సెప్టెంబర్ 2 (జనం సాక్షి)ఆదిశిలా క్షేత్రం అపర తిరుపతి మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం సాయంత్రం గంప జాతర సందర్భంగా ఊరేగింపు నిర్వహించారు.పట్వారీ అరవిందరావు ఆలయ కార్యిర్వహణాధికారి సత్య చంద్రారెడ్డి,వాల్మీకి పూజారుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గంప జాతర దేవాలయంలో పూజల అనంతరం సాయంత్రం ఉత్సవ విగ్రహాలతో పల్లకి సేవ నిర్వహించి దేవరగట్టు నుండి దశమికట్టవరకు ఊరేగింపుగా వెళ్లడం జరిగింది.ఈ కార్యక్రమంలో చంద్రశేఖర రావు,వీరారెడ్డి పలువురు భక్తులు గంప జాతరలో పాల్గొన్నారు.