డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి చిరస్మరణీయుడు* టీపీసీసీ కార్యదర్శి భూక్య మంగీలాల్ నాయక్
టేకులపల్లి, సెప్టెంబర్ 2 (జనం సాక్షి ): ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేదలు, బడుగు బలహీన వర్గాలకు ఆయన చేసిన సేవలు మరువలేనివని, దేశ ప్రజలకే ఆయన చిరస్మరణీయుడని టీపీసీసీ కార్యదర్శి, ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు భూక్య మంగీలాల్ నాయక్ అన్నారు. శనివారం వైయస్సార్ 14వ వర్ధంతి సందర్భంగా టేకులపల్లి మండల కేంద్రంలో, సులానగర్లలో రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలను, ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు రైతు రుణానికి ఓకే దాఫలో రైతు ఋణ మాఫీ, రైతులకు త్రీఫేస్ ఉచిత విద్యుత్తు, ఇందిర్మ ఇల్లు, ఉచిత విద్య, మహిళాల డ్వాక్రా ఋణలు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చేసిన ఘనత వారికే దక్కుతుంది అని కొనియాడినారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు భూక్యా దేవా నాయక్, ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ రాసమళ్ళ నరసయ్య, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆకారపు స్వప్న, మండల ఉపాధ్యక్షులు వీసం శ్రీనివాస రావు, ఉండేటి దేవరాజు, బల్లెం ప్రకాష్, గుండా రవీందర్ రెడ్డి, అంగోతు నమోదర్ నాయక్,భూక్యా లక్ష్మణ్ నాయక్ లావుడియా అర్జున్ తదితరులు పాలొగొన్నారు.