మహనీయుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి……., ..చెన్నూరు కాంగ్రెస్ నాయకులు డాక్టర్ రాజా రమేష్
నాయకుల్లో మహనీయుడు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని, ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పటికి ప్రజల గుండెల్లో ఉన్నాయని, ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ చేసిన అభివృద్ధి, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేటికి ప్రజలు మరువలేరని చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ రాజా రమేష్ అన్నారు. శనివారం దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతి సందర్భంగా చెన్నూరు పట్టణం లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి వైఎస్ఆర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం ఇప్పటికి కాంగ్రెస్ పార్టీకి, దేశ, రాష్ట్ర ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని, రాష్ట్రంలో విద్య వ్యస్థను బలోపేతం చేసేందుకు, నిరుపేదలకు విద్యను అందించేందుకు ఫీజు రీయంబర్స్మెంట్ ప్రవేశపెట్టింది వైఎస్ఆర్ అని, మహిళల సంక్షేమానికి 104 అంబులెన్సులను, అత్యవసర అంబులెన్స్ సర్వీస్ 108ను, ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందించేందుకు ఆరోగ్య శ్రీ, రైతుల సంక్షేమానికి ఉచిత విద్యుత్, రుణమాఫీ పథకాలు, ఉచిత విద్యుత్ ప్రవేశపెట్టిన ఘనత వైఎస్ఆర్కి దక్కుతుందని కొనియాడారు. ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను గుర్తించి వాటి పరిష్కారానికి అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, వైఎస్ఆర్ చిరునవ్వుతోనే ప్రజల ఆనందం ఉందని తెలిపారు. మహానుభావుడి లక్ష్యం ప్రజల సంక్షేమం ఆయన ఆశయాలను నెరవేర్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు మంత్రి రాజయ్య, భద్రచారి, బుర్ర కృష్ణ, అన్వర్, బషీర్, గుడిమల్ల వెంకన్న, కొట్టే రాజన్న, ఎన్నం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.