నిత్యవసర సరుకుల ధరలను తగ్గించాలి

జనం సాక్షి దుబ్బాక
సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దుబ్బాక MRO కార్యాలయం ముందు ధర్నా.

సిద్దిపేట జిల్లా దుబ్బాక MRO కార్యాలయం ముందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించాలని ధర్నా నిర్వహించి ఉప తాసిల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.అనంతరం సిపిఎం పార్టీ సిద్దిపేట జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.భాస్కర్ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం నిత్యవసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచుతూ పేద,బడుగు, బలహీనవర్గాల ప్రజల పైన మోయలేని భారాలు మోపుతుందని విమర్శించారు. పెట్రోల్,డీజిల్,గ్యాస్ ధరలపై ధరల నియంత్రణ పూర్తిగా ఎత్తివేసి ఇష్టానుసారంగా ధరలు పెంచి దేశ ప్రజలను మొసం చేస్తుందని విమర్శించారు.400 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ 1200 రూపాయలకు పెంచి ఎలక్షన్ సందర్భంగా 200 రూపాయలు గ్యాస్ సిలిండర్ ధర తగ్గించి ప్రజలను మోసం చేసేందుకు సిద్ధపడుతుందని బిజెపిని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పూర్తిగా తగ్గిపోయిన పెట్రోల్,డీజిల్, గ్యాస్ ధరలు మాత్రం తగ్గడం లేదని మండిపడ్డారు.GST పేరుతో ప్రతి వస్తువు పైన పన్నుల విధిస్తూ ప్రజల నుంచి టాక్సీలు వసూలు చేసి కార్పొరేట్ ధనవంతుల కొరకు లక్షల కోట్ల రూపాయలు రుణాలు మాఫీ చేస్తూ,రాయితీలు కల్పిస్తూ దేశ సంపదను కార్పోరేట్ గుత్త పెట్టుబడిదారులకు దోచిపెడుతుందని విమర్శించారు. బిజెపి కేంద్ర ప్రభుత్వం ధరలను అదుపు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. బిజేపీ ప్రజా వ్యతిరేక విధానాలతో కార్పొరేట్ అనుకూల విధానాలతో పరిపాలన కొనసాగిస్తుందని విమర్శించారు.ఈ సమస్యలన్నిటి నుండి ప్రజలను పక్కదారి పట్టించేందుకు కుల,మత వైశ్యమాల సృష్టిస్తూ ప్రజల మధ్యన గొడవల సృష్టిస్తుందని విమర్శించారు.కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజా వ్యతిరేక విధానాలు మానుకొని ప్రజా అనుకూలమైన పరిపాలన కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు ఎండి సాజిద్, మల్లేశం,రాజు,శంకర్,అల్లావుద్దీన్, మైమూద్, నర్సింలు,నగేష్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు