ఫిర్యాదులపై వెంటనే చట్ట పరంగా చర్యలు తీసుకోవాలి

-జిల్లా అదనపు ఎస్పి ఎన్ రవి.

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 4 (జనం సాక్షి);శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారానికి బాధితులకు అండగా ఉంటూ ఫిర్యాదుల పై వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా అదనపు ఎస్పీ ఎన్. రవి అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయం లో ప్రజావాణి సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వివిధ సమస్యల పై బాధితుల నుండి వచ్చిన 10 అర్జిలను జిల్లా అదనపు ఎస్పీ గారు స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ ప్రజావాణి లో బాధితుల నుండి వచ్చిన ఫిర్యాదుల పై ఆయా పోలీసు స్టేషన్ ల అధికారులతో మాట్లాడుతూ పోలీసు పరిధిలోని ప్రతి అంశాన్ని చట్ట పరిదిలో పరిష్కరించడంలో, బాధితులకు న్యాయం చేయడంలో వేగంగా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను అదనపు ఎస్పీ ఆదేశించారు.బాధితులకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని భరోసా కల్పించారు. అలాగే చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తూ, శాంతిభద్రతల పరిస్థితులకు భంగం కలిగించేవారి పట్ల, మహిళలకూ వ్యతిరేకంగా జరిగే నేరాల పట్ల కఠినంగా వ్యవహరించాలని అదనపు ఎస్పీ అధికారులను ఆదేశించారు.

తాజావార్తలు