మతిస్థిమితం లెనివ్యక్తి లారీ కిందదూరి మృతి.
పట్టణ సిఐరాజేందర్ రెడ్డి.
తాండూరుసెప్టెంబర్4(జనంసాక్షి):మతిస్థిమితం లేని వ్యక్తి లారీ కింద దూరి మృతి చెందిన సంఘటన సోమవారం మధ్యాహ్నం తాండూర్ పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం
తాండూరు పట్టణంలో ని మార్వాడి బజార్ కి చెందిన పల్లె పోతూ అయ్యప్ప తండ్రి పూర్ణ చందర్రావు వయస్సు 40 సంవత్సరాలుగా గుర్తించారు. గత ఆరు సంవత్సరాల నుండి మతిస్థిమితం సరిగా లేదని ఆయ్యప్ప సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో తాండూర్ పట్టణంలోని శివాజీ చౌక్ సమీపంలో గౌతాపూర్ వైపు వెళ్తున్న లారీ నెంబర్ టీఎస్ 06 యు సి 2058 కిందికి కావాలని దూరడం వల్ల లారీ వెనక టైరు మృతుని కడుపుపై నుండి వెలింది .గాయాలపాలయ్యారు. చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తవ్విసడగా అయ్యప్ప మృతి చెందారు. ఈ విషయం మృతుని కుటుంబ సభ్యులకు తెలిపారు. మృతుని తల్లి భాగ్యలక్ష్మి తగు చర్య గురించి దరఖాస్తు చేసుకోగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.