ఆశ వర్కర్లకు ఫిక్స్ డ్ వేతనం 18000/- రూ లు ఇవ్వాలి.
దౌల్తాబాద్ సెప్టెంబర్ 5, జనం సాక్షి:గత కొన్ని సంవత్సరాలుగా ఆశా వర్కర్లు ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్నారని కాని ఆశ వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేయకుండా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మొసం చేస్తున్నాయని విమర్శించారు. పెరుగుతున్న ధరలకు అనుకూలంగా కనీస వేతనం 18000 వేల రూపాయాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.32 రకాల రిజిస్టర్లను ప్రభుత్వమే సప్లై చేయాలని డిమాండ్ చేశారు టీబీ,లెప్రసి,కంటి వెలుగు సంబంధించిన తదితర పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని లెప్రసీ సర్వేలో వస్తున్న ఇబ్బందులను పరిష్కరించి వాలంటీర్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.ఆశాలకు సంబంధంలేని అధనపు పనులను రద్దు చేయాలని 2021 సంవత్సరంలో ఆరు నెలలు పెండింగ్లో ఉన్న పిఆర్సి వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆశ వర్కర్లకు ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్స్ బాలమణి, మంజుల, లక్ష్మి, భాగ్య, రజిత, లావణ్య, రేణుక, శాహేదా, సుల్తానా పాల్గొన్నారు.