అవగాహన లేకుండా చెక్ డ్యామ్ ల నిర్మాణం
వేములవాడ గ్రామీణం, సెప్టెంబర్ 5 (జనంసాక్షి): అధికారులు మూలవాగు పై చెక్ డ్యామ్ లను అవగాహన లేకుండా నిర్మించారని బిజెపి వేములవాడ గ్రామీణ అధ్యక్షుడు జక్కుల తిరుపతి ఆరోపించారు. గ్రామీణ మండలంలోని బొల్లారం, జయవరం గ్రామాలలో వర్షాల కారణంగా నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిన పంట పొలాలను ఆయన మంగళవారం పరిశీలించారు. చెక్ డ్యామ్ ల నిర్మాణం సరిగా చేయకపోవడంతో పంట పొలాలకు నష్టం వాటిల్లి రైతులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వెంటనే అధికారులు బాధితులకు నష్టపరిహారం ఇప్పించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మల్లికార్జున్, అనిల్, రాజు, గౌతమ్, మల్యాల రాజు గౌడ్, వెంకటేష్, ఆకుల బాబు, పరమేష్, కిరణ్, నరేష్, విజయ్, మహేష్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.