రాష్ట్రస్థాయి ఉత్తమ శాఖాధిపతిగా శ్రీదేవి
వేములవాడ గ్రామీణం, సెప్టెంబర్ 5 (జనంసాక్షి): వేములవాడ మండలం అగ్రహారంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ శాఖధిపతి శ్రీదేవికి రాష్ట్రస్థాయి ఉత్తమ శాఖాధిపతి అవార్డుకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ రాజగోపాల్ తెలిపారు. 28 సంవత్సరాలుగా సాంకేతిక విద్యాశాఖలో చేసిన ఉత్తమ బోధనకు గాను మంగళవారం గురుపూజోత్సవ దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ రవీంద్రభారతిలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్ర రెడ్డి చేతుల మీదుగా ఈ అవార్డును ఆమె అందుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా అధ్యాపక బృందం ఆమెను అభినందించారు. ఈ కార్యక్రమంలో శాఖాధిపతులు రవికుమార్, ప్రభాకరాచారి, కృష్ణ మనోహర్, సంధ్యారాణి, సయ్యద్ షహబాజ్, అధ్యాపక బృందం విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు.