కాంగ్రెస్ పార్టీలో చేరిన యువకులు
బిచ్కుంద సెప్టెంబర్ 05 (జనంసాక్షి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని కొడప్గల్ మండలంలో గల పెద్ద దేవి సింగ్ తండా నుండి బి.అర్.స్ పార్టీ మరియు బీజేపీ పార్టీల నుండి జుక్కల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ సౌదగర్ గంగారం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని, కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రణయ్ రెడ్డి, సౌదాగర్ అరవింద్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.