Wednesday, 4 November 2026

గీత కార్మికున్ని “బలి” తీసుకున్న ఆర్థిక సమస్యలు. ఉరివేసుకొని గీత కార్మికుడి బలవన్మరణం. పెద్దూరులో విషాదం.

ఆర్థిక ఇబ్బందులు ఓ గీత కార్మికుడి ప్రాణలు తీసాయి. ఆర్థిక ఇబ్బందులకు తాళలేక గీత కార్మికుడు ఉరి పోసుకొని బరవర్మనానికి పాల్పడ్డ ఘటన సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరులో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరు లో బెజ్జారపు రమేష్ (45). గీత వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా వృత్తిపరమైన సమస్యలతో పాటు ఆర్థిక ఇబ్బందులతో సతమతమావుతున్నాడు. ఆర్థిక సమస్యల మూలంగా తీవ్రంగా మనస్థాపన చెంది మంగళవారం ఇంట్లో ఉరివేసుకొని బలవన్మరానికి మరణానికి పాల్పడ్డాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య బాలామణి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన పెద్దూరులో తీవ్రవిషధాన్ని నింపింది.