Wednesday, 4 November 2026

ఆది వరహాస్వామి హుండీ ఆదాయం రూ. 5,23,946

కమాన్ పూర్, జనం సాక్షి : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ ఆది వరహాస్వామి హుండీ ఆదాయం రూ.5,23,946 వచ్చింది. బుధవారం ఆదివరహా స్వామి ప్రాంగణంలోని కళ్యాణ మండపంలో హుండీ ఆదాయాన్ని లెక్కించారు. ఇటీవల స్వామి వారి జయంతి ఉత్సవాల్లో భక్తులు కానుకలను హుండీలో సమర్పించారు. అలాగే గత ఐదు నెలల క్రితం హుండీ లెక్కించగా మళ్లీ బుధవారం రోజు లెక్కించారు. ఈ లెక్కింపులో ఆలయ కమిటీ చైర్మన్ ఇనగంటి ప్రేమలత జగన్నాథరావు ఆలయ కార్యనిర్వణ అధికారి కొసన కాంత రెడ్డి దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఆర్ సుజాత, డైరెక్టర్లు దండే కనక రత్నం పిడుగు అంజి బొంపల్లి జ్యోతి కొలిపాక లక్ష్మి నాయకులు ఇనగంటి రామారావు, ఆలయ సిబ్బంది కల్వల సంతు, మల్లేష్, సేవా సమితి సభ్యులు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.