కాంగ్రెస్ కు చెయ్యి ఇచ్చి .. కారు ఎక్కిన ముఖ్య కాంగ్రెస్ నేతలు
సంగారెడ్డి నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలి
రాష్ట్ర ఆర్థిక శాఖ మాత్యులు తన్నీరు హరీష్ రావు
సంగారెడ్డి బ్యూరో , జనం సాక్షి , సెప్టెంబర్ 6 :::::::సంగారెడ్డి నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలనీ రాష్ట్ర ఆర్థిక శాఖ మాత్యులు తన్నీరు హరీష్ రావు అన్నారు. బుధవారం మంత్రి హరీష్ రావు నివాసంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు బి ఆర్ ఎస్ పార్టీలో చేరారు. చింతా ప్రభాకర్ అధ్వర్యంలో మంత్రి హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.పార్టీలో చేరిన ముఖ్యులు .. కొండాపూర్ మం. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇంద్రారెడ్డి, సర్పంచ్ అంకుషా ఇంద్రా రెడ్డి, ఏడు మంది వార్డు సభ్యులు ,మాజీ ఎంపీటీసీ ప్రకాశం , ఎద్దుమైలారం మాజీ సర్పంచ్ దశరథ్ , మల్కాపూర్ బిజెపి మాజీ ఎంపీటీసీ తమని ,ప్రవీణ్ ,వివిధ యువజన సంఘం నేతలు ,వీరితో పాటు ఆరు వందల మంది నేతలు బీఆర్ఎస్ పార్టీ లో చేరారు . పార్టీలో చేరిన కాంగ్రెస్ నేతలను మంత్రి హరీష్ రావు పార్టీ కండువాలను కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ సంగారెడ్డిలో గెలిచిన ఎమ్మెల్యే నాలుగున్నర సంవత్సరాల నుంచి ప్రజలకు దూరంగా ఉంటూ ,నియోజకవర్గాన్ని పట్టించుకోకపోయినా ,చింతా ప్రభాకర్ నిరంతరం సంగారెడ్డి అభివృద్ధికి కృషి చేస్తూ, ప్రజలకు కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారన్నారు.సంగారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ విజయానికి కృషి చేయాలని మంత్రి సూచించారు. అనంతరం పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ గెలిచిన ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడం , పార్టీ నాయకులను పట్టించుకోకపోవడంతో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగిందన్నారు.ఎమ్మెల్యే సొంత ప్రయోజనాలకే మాలాంటి యువకులను వాడుకున్నారు తప్ప మాకు ఎప్పుడు అందుబాటులో లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు . వచ్చే ఎన్నికల్లో చింతా ప్రభాకర్ నాయకత్వంలో సంగారెడ్డిలో బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని వారు హామీని ఇచ్చారు.