మహిళ సంఘాలు బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలపడాలి

— సర్పంచ్ పేలపూడి మధు

మోత్కూరు సెప్టెంబర్ 6 జనం సాక్షి : మహిళ సంఘాలు బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థికంగా బలపడాలని సర్పంచ్ పేలపూడి మధు అన్నారు. బుధవారం మండలంలోని పొడిచేడు గ్రామంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ గ్రౌండింగ్ పర్పస్ లో భాగంగా గ్రామానికి చెందిన గందే రజిని కి 3.6 లక్షల యూనిట్ కారం గిర్ని, పిండి గిర్ని ని సర్పంచ్ పేలపూడి మధు ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మధు మాట్లాడుతూ మహిళా సంఘాలు బ్యాంకు నుండి తీసుకునే రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వివో ఏలు బండ రామ నరసయ్య, జిట్ట మంజుల, బోయపల్లి సైదులు, ఓర్సు నాగులు,జిట్ట పాపమ్మ, తొంట ఐలమ్మ, కోక సబిత, కాసర్ల పర్వతమ్మ, మురారి శెట్టి సత్తమ్మ, కొమ్ము మంజుల, ఎర్ర ఈరమ్మ, చిందాల జయమ్మ, వల్లందాసు లాస్య, దెందె రామ నరసమ్మ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు