వ్యాయామ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలి..
వేములవాడ, సెప్టెంబర్ 6 (జనంసాక్షి): వ్యాయామ ఉపాధ్యాయులకు పదోన్నతి కల్పించేలా ప్రభుత్వం కృషి చేయాలని టిజిపేట రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు దుప్పటి రవికుమార్, ప్రధాన కార్యదర్శి నాంపల్లి శ్రీనివాస్ కోరారు. వ్యాయామ ఉపాధ్యాయులకు సంబంధించిన కోర్టు కేసు ఫైనల్ ఇయరింగ్స్ పూర్తయి, జడ్జిమెంట్ రిజర్వులో ఉంచారన్నారు. దీంతో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులలో తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వపరంగా చర్యలు తీసుకొని పదోన్నతులలో అవకాశం కల్పించాలని వారు పేర్కొన్నారు.