సామాజిక సంఘకర్త రాములు ఇకలేరు
తాండూరు సెప్టెంబర్ 6 (జనం సాక్షి) :సామాజిక సంఘ కర్త మీది కేరి రాములు బుధవారం అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. యాలాల మండలం సంఘం కుర్దు గ్రామంలో నివాసముంటున్న రాములు గత కొంతకాలం క్రితం తాండూరు పట్టణంలోని మల్లప్ప మడియ సమీపంలో వ్యాపారం నిర్వహించారు.అదేవిధంగా చిన్ననాటి నుండి ఆర్ఎస్ఎస్ లో సామాజిక సంఘ కర్తగా కొనసాగారు. అనారోగ్యం కారణంగా హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం స్వర్గస్తులయ్యారు. రాములు మృతి పట్ల బంధువులు కుటుంబ సభ్యులు తోటి మిత్రులు ఆర్ఎస్ఎస్ సంఘకర్తలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ ఆయన కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించారు. మృతుడు రాములు అంత్యక్రియలు గురువారం యాలాల మండలం
సంగం ఖుర్డు, గ్రామంలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.