సీఎం కేసీఆర్ పాలనలో విద్యకు గౌరవిస్తూ దేశానికి ఆదర్శంగా తెలంగాణ
సమాజంలో రాష్ట్రంలో పెద్ద కుటుంబం అంటే ఉపాధ్యాయులది విద్యార్థులదే
గురువులను సన్మానించడం మన సంప్రదాయం
హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్
సంగారెడ్డి బ్యూరో, జనం సాక్షి , సెప్టెంబర్ 6 ::::సీఎం కేసీఆర్ పాలనలో విద్యకు గౌరవిస్తూ దేశానికి ఆదర్శంగా తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని, సమాజంలో రాష్ట్రంలో పెద్ద కుటుంబం అంటే ఉపాధ్యాయులది విద్యార్థులదే అని, అలాంటి గురువులను సన్మానించడం మన సంప్రదాయం అని హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్ అన్నారు.సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి చౌరస్తాలోని పీఎస్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో గురుపూజోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు . ఈ కార్యక్రమంలో చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో నియోజకవర్గం లోని ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమా లతోపాటు పురస్కారాలు అందజేశారు.ముందుగా జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.నియోజకవర్గంలోని ఉత్తమ ఉపాధ్యాయులతో పాటు 130 మంది ఉపాధ్యాయులకు చింతా ప్రభాకర్ , జిల్లా పరిషత్ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డితో కలిసి సన్మానం చేశారు.ఈ సందర్భంగా చింత ప్రభాకర్ మాట్లాడుతూసమాజంలో రాష్ట్రంలో పెద్ద కుటుంబం అంటే ఉపాధ్యాయులది విద్యార్థులదే అని కొనియాడారు.సీఎం కేసీఆర్ విద్యకు ప్రాధాన్యతరిస్తూ.. గురువులను నిలువెత్తు గౌరవం అందాలని కోరిన వ్యక్తి సీఎం కేసీఆర్ అన్నారు.తెలంగాణ ఆచరిస్తే దేశం అనుసరించే స్థాయిలో తెలంగాణ ఉందని ఆయన చెప్పుకువచ్చారు.ఉపాధ్యాయ సమస్యలను సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లడానికి కృషి చేస్తానని ఆయన ఉపాధ్యాయులకు హామీ ఇచ్చారు. అందుకే ఉపాధ్యాయుల ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలనీ కోరారు అనంతరం ఉపాద్యాయ సంఘం నేతలు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం కావాలంటే చింత ప్రభాకర్ లాంటి నాయకులు విద్యా శాఖ మంత్రి కావాలని కోరారు.భారీ మెజార్టీ తో ఎమ్మెల్యే గా విజయం సాధించి విద్యా శాఖ మంత్రి పదవి రావాలి అని ఉపాద్యాయ సంఘం ,ఉపాధ్యాయుల తరుపున కోరుకుంటున్నామన్నారు .ఉపాధ్యాయుల పట్ల చింతా ప్రభాకర్ కు ఉన్న అవగాహన , ఎప్పుడు వెళ్ళినా తన మాటలలోనే సమస్యలు పరిష్కరించే విధంగా బరోసా కల్పించి పనులను చేస్తారని వారు కొనియాడారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజు శ్రీ జయపాల్ రెడ్డి, జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, మాజీ సి డి సి చైర్మన్ విజయేందర్ రెడ్డి, సి డి సి చైర్మన్ బుచ్చిరెడ్డి, మార్కెట్ కమిటీ అధ్యక్షుడు ప్రభు గౌడ్, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ శ్రీహరి, నాయకులు మధుసూదన్ రెడ్డి, జైపాల్ రెడ్డి, సంగారెడ్డి ఎంఈఓ వెంకట నరసింహులు, సదాశివపేట ఎంఈఓ అంజయ్య, కొండాపూర్ ఎంఈఓ భీమ్ సింగ్, ఉపాధ్యాయ సంఘ నాయకులు అనంతరం, సాబీర్ అలీ , అశోక్ కుమార్, తుకారం , ఉపాధ్యాయులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.