క్షమాపణ చెప్పిస్తారా.. రాజీనామా చేస్తారా..
బిజెపి పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్.
పద్మశాలి సంఘం అధ్యక్షుడు తీరుపై ఆగ్రహం.
రాజన్న సిరిసిల్ల బ్యూరో. సెప్టెంబర్ 7. (జనంసాక్షి). బహిరంగంగా పద్మశాలి సమాజాన్ని ఉద్దేశించి చులకనగా మాట్లాడిన వాళ్లతో క్షమాపణ చెప్పిస్తారా లేక అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తారా అంటూ బిజెపి పట్టణ అధ్యక్షులు నాగుల శ్రీనివాస్ అన్నారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బిజెపి పట్టణ అధ్యక్షులు నాగుల శ్రీనివాస్ పద్మశాలి సంఘం అధ్యక్షుని వైఖరిపై మండిపడ్డారు. సోషల్ మీడియాలో కామెంట్ చేసిన అణామకులతో క్షమాపణ చెప్పించిన అధ్యక్షుడికి పద్మశాలి సమాజాన్ని బహిరంగంగా దూషించిన వ్యక్తులతో ఎందుకు క్షమాపణ చెప్పించడం లేదంటూ ప్రశ్నించారు. కేవలం అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళ పక్షమే వహించడం ఎమేరకు సమంజసమని మిగతా పార్టీలో ఉన్న పద్మశాలి బిడ్డలు కనిపిస్తలేరా అంటూ ప్రశ్నించారు. పద్మశాలి సమాజం నిర్వహించే కార్యక్రమాలకు అన్ని పార్టీలకు చెందిన పద్మశాలి బిడ్డలను పిలవాల్సిన అవసరం ఉందని అన్నారు. పద్మశాలి యువజన సంఘం వ్యవహారంపై కూడా మండిపడ్డారు. తక్షణమే అధికార పార్టీకి చెందిన నాయకుల చేత క్షమాపణ చెప్పించాలని లేకపోతే రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. సమావేశంలో బిజెపి నాయకులు ఎనగంటి నరేష్, ఊరగొండ రాజు, గాజుల సదానందం, ద్యావనపల్లి రామకృష్ణ, అంకారపు రాజు, సామల యాదగిరి తదితరులు పాల్గొన్నారు