పేద కుటుంబాలకు అండగా బిఆర్ఎస్ ప్రభుత్వం.

మంత్రి పట్నం మహేందర్ రెడ్డి.
తాండూరు సెప్టెంబర్ 7(జనంసాక్షి) నిరుపేద కుటుంబాలకు బిఆర్ఎస్ ప్రభుత్వం అండగా
ఉందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల మరియు భూగర్భ గనుల శాఖ మంత్రి మంత్రి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి పేర్కొన్నారు.గురువారం హైదరాబాద్ లోని మంత్రి మహేందర్ రెడ్డి నివాసంలో వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం ఉద్దండపుర్ గ్రామానికి చెందిన జమీల అరిఫ్ కుటుంబ సభ్యులకు రూ.90 వేల సీఎం ఎల్ ఓసిని మంత్రి పట్నం మహేందర్ రెడ్డి భాదితకుటుంబసభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి పేద ప్రజలకు వరం లాంటిదని అన్నారు. అనారోగ్యానికి గురైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు