నాగరాజు కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన సోషల్ రెస్పాన్సిబిలిటీ టీం

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 7 (జనం సాక్షి);జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండల పరిధిలోని బీరోలి గ్రామానికి చెందిన
నాగరాజు (50) కుటుంబ సభ్యులకు గురువారం గద్వాల సోషల్ రెస్పాన్సిబిలిటీ సభ్యులు 36,000/- రూపాయలను అందజేశారు.రెక్కాడితే గాని డొక్కాడని బతుకు జీవులు బతుకుదెరువు కొరకై మూడు సంవత్సరాల క్రితం హైదరాబాద్ కు వెళ్లి జీవనోపాధి పొందుతున్న క్రమం లో యాక్సిడెంట్స్ కావడంతో ఇంటికే పరిమితమైన నాగరాజు కుటుంబం దీంతో బార్య ఇండ్లలో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నది.ఈ క్రమంలో నాగరాజు కు వారం క్రితం హార్ట్ అటాక్ రావడం తో ఉస్మానియా హాస్పిటల్ లో జాయిన్ కావడం జరిగింది. హార్ట్ లో మూడు వాల్స్ బ్లాక్ అయ్యని డాక్టర్స్ చెప్పారనీ, ఈ పరిస్థితి లో ఆర్థిక సహాయం కొరకై సోషల్ రెస్పాన్సిబిలిటీ టీమ్ ను సంప్రదించడం తో వారికి హాస్పిటల్ కార్చుల నిమిత్తం 36,000/- రూపాయలు సోషల్ రెస్పాన్సిబిలిటీ టీమ్ ద్వారా అందజేయడం జరిగిందనీ సోషల్ రెస్పాన్సిబిలిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలోరామాంజనేయులు,ప్రసాద్,విలియమ్,బెంజావేను,మురళి,సర్వేశ్వర,కళ్లెం శ్రీనివాస్ రెడ్డి,అశోక్ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు