చైర్మన్ నరోత్తం కు శుభాకాంక్షలు తెలిపిన ఎల్పింగ్ హాండ్స్ ఫౌండేషన్ చైర్మన్
జహీరాబాద్ సెప్టెంబర్ 15 (జనం సాక్షి ) రాష్ట్ర ఎస్సి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన ఏర్పుల నరోత్తం ని జహీరాబాద్ లోని తన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలిపిన ఎల్పింగ్ హాండ్స్ ఫౌండేషన్ చైర్మన్ మొరంగిపల్లి జైపాల్ ఈ సందర్భంగా నరొత్తం కు శాలువా పూలమాల తో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. చైర్మన్ నరోత్తం ఇంకెన్నో పదవులు అధిరోహించాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఎల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ప్రతినిధులు మోహన్, ఎసన్న, రాయికోటి నర్సిములు తదితరులు పాల్గొన్నారు.