Thursday, 5 November 2026

యాదవ సంఘం భవనానికి 5 లక్షల మంజూరు పత్రం అందజేత.

దౌల్తాబాద్ సెప్టెంబర్ 19, జనం సాక్షి.

దౌల్తాబాద్ మండల పరిధిలో కోనాయపల్లి గ్రామంలో యాదవ సంఘం భవన నిర్మాణానికి ఐదు లక్షలు మంజూరు పత్రాన్ని సంఘం సభ్యులకు బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రణం శ్రీనివాస్ గౌడ్ అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోనాయిపల్లి గ్రామానికి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటనకు వచ్చిన సందర్భంగా యాదవ సంఘం సభ్యులు యాదవ సంఘం భవనం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ అల్లిశేఖర్ రెడ్డి, యాదవ సంఘం అధ్యక్షులు బాలమల్లు, యాదవ సభ్యులు దుర్గయ్య , నరేష్, కృష్ణ, శ్రీనివాస్, నర్సింలు, మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.