హెల్త్ క్యాంపు నిర్వహించిన ఆరోగ్య సిబ్బంది
ఏటూరునాగారం
(జనంసాక్షి)సెప్టెంబర్19.
ఈరోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రొయ్యూరు పరిధిలో గల హెల్త్ వెల్నెస్ సెంటర్ గోగుపల్లీ లోని, రామన్నగూడెం గ్రామంలో డాక్టర్ సుచరిత మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది.విష జ్వరాలు పరిసరాల పరిశుభ్రత, దోమతెరలు వాడుట మరియు ఆరోగ్య సూచనలు ఇవ్వడం జరిగింది. జ్వరం రెండు రోజుల కంటే ఎక్కువ ఉన్నవారికి రక్త పరీక్షలు చేసి, 67 మందికి మందులు పంపిణీ చేయడం జరిగింది. జ్వరం వచ్చిన 22 మందికి రక్త పరీక్షలు చేయగా అందరికీ నెగిటివ్ వచ్చింది. ఈ కార్యక్రమంలో గ్రామసర్పంచ్ దొడ్డ కృష్ణ, హెల్త్ అసిస్టంట్ జైల్ బాబు, ఏఎన్ఎం ధనలక్ష్మి, ఆశా లు పాల్గొన్నారు




