Thursday, 5 November 2026

అంగన్వాడి ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు సంఘీభావం

తెలిపిన దుబ్బాక కాంగ్రెస్ నాయకురాలు కత్తి కార్తీక గౌడ్ జనం సాక్షి దుబ్బాక . దుబ్బాక నియోజకవర్గం,
దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో మహిళా సంక్షేమ కార్యాలయం నందు గత 9 రోజులుగా జరుగుతున్న అంగన్వాడి ఉద్యోగుల సమ్మెలో ఈరోజు *తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్, తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి, దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ నాయకురాలు కత్తి కార్తిక గౌడ్ సంఘీభావం తెలిపి వారికి మద్దతు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగులు మనకు సేవ చేసే బటులని వారిని ఎల్లవేళలా ప్రభుత్వం మంచిగా చూసుకోవాలని వారు అడుగుతున్న డిమాండ్స్ వాస్తవం అని వారి కష్టాల్లో ప్రభుత్వం కచ్చితంగా ఇంకా భాగస్వామ్యం తీసుకొని వారికి మంచి మెరుగైన విధివిధానాలతో కూడిన సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. అలాగే అంగన్వాడి లో ఉన్న టెంపర్వరి ఉద్యోగులను తక్షణమే పర్మినెంట్ చేయాలి అని,కనీస వేతనం రూ.26000/- కచ్చితంగా చెల్లించాలినీ,పెన్షన్,ఈఎస్ఐ,ఉద్యోగ భద్రత కల్పించాలి కోరారు. అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీ ఉద్యోగులందరికీ గ్యారెండిటీ చెల్లించాలినీ,రిటైర్మెంట్ బెనిఫిట్స్ (ప్రయోజనాలు) టీచర్లకు 10 లక్షలు,హెల్పర్లకు 5 లక్షలు చెల్లించాలినీ,
జీవితంలో సగం పెన్షన్ ఇచ్చేందుకు నిర్ణయించాలినీ కోరారు.60 సంవత్సరాలు తర్వాత అంగన్వాడీ వర్కర్లు వాలంటరీ రిటైర్మెంట్ అడిగితే వాళ్లకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ తప్పనిసరిగా కల్పించాలినీ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.
ప్రతి అంగన్వాడి వర్కర్ కు ప్రభుత్వ బీమా 5 లక్షలు అందజేయాడం తప్పనిసరి అని డిమాండ్ చేశారు.ఎస్ఎస్సి అర్హత ఉన్న అంగన్వాడీ హెల్పర్లకు ప్రమోషన్స్ ఇవ్వాలినీ,బ్లాక్ లెవెల్ డ్యూటీ రద్దు చేయాలినీ, ఒకవేళ బ్లాక్ లెవెల్ డ్యూటీ అంగన్వాడి వర్కర్లతో చేపిస్తే వాళ్లకు అదనపు వేతనం చెల్లించాలినీ కోరారు. వారి
డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేసి కచ్చితంగా దీని గురించి ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రతి మహిళకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ప్రతినెల 2500 రూపాయలు వస్తాయని,
అలాగే మన తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ విజయభేరి సభలో చెప్పిన విధంగా 6 గ్యారంటీలు కచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమల్లోకి తెస్తామని వారు తెలియజేశారు. అలాగే అధిష్టానంతో అంగన్వాడీల వర్కర్లు గురించి కూడా చర్చించి వారికి ఉపయోగపడేలాగా మేనిఫెస్టో ఉండేలా నా వంతు కృషి చేస్తానని అంగన్వాడి వర్కర్లకు భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో “టిపిసిసి మాజీ ఆర్గనైజింగ్ సెక్రటరీ” కర్నల్ శ్రీనివాసరావు, మంచాల మల్లేశం, ఎల్లం, ఐరేని సాయితేజ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.