తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ శాంతకుమారిని, కలిసి ఏటూరునాగారం డివిజన్ చేయాలని, మల్లంపల్లి మండలంగా ప్రకటించాలని వినతి పత్రాన్ని అందజేసిన ములుగు ఎమ్మేల్యే దనసరి సీతక్క
ఏటూరునాగారం
(జనంసాక్షి)సెప్టెంబర్19.
మంగళవారం రోజున హైదరాబాద్ నందు గల సెక్రటేరియట్ కార్యాలయం నందు తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ శాంత కుమారి ని ఏఐసీసీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి మరియు ములుగు ఎమ్మేల్యే దనసరి సీతక్క మర్యాదపూర్వకంగా కలిసి ములుగు జిల్లాలోని ఏటూరునాగారం మండలాన్ని చుట్టూ ప్రక్కల ఉన్న ఆరు మండలాలతో కలిపి డివిజన్ ఏర్పాటు చేయాలని, అలాగే మల్లంపల్లి గ్రామాన్ని చుట్టూ ప్రక్కల గ్రామాల ప్రజల కోరిక మేరకు మండలంగా ప్రకటించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందించడం జరిగింది.




