ప్రతి ఇంటి నుంచి ముదిరాజ్ లు తరలి రావాలి
రాజంపేట్ సెప్టెంబర్ 19 జనంసాక్షి
కామారెడ్డి జిల్లా రాజంపేట్ మండల కేంద్రంలో పెద్దమ్మ ఆలయ పాంగణoలో మంగళవారం రాజంపేట్ మండల ముదిరాజ్ సంఘాల ఐక్యవేదిక సభ్యులు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా హలో ముదిరాజ్ చలో కామారెడ్డి అనే వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ మన ముదిరాజ్ మహాసభ రాష్ట కార్యదర్శి అబ్రమైన స్వామి, మేం ఎంతో మాకు అంత రాజకీయవాట అన్ని పార్టీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముదిరాజ్ సంఘం సభ్యులు విలేకరులతో మాట్లాడారు. ము దిరాజులను విస్మరించిన ముఖ్యమంత్రి కి గుణపాఠం చెప్తామన్నారు.. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ దీక్షను విరమించే సమయంలో ఉద్యమాన్ని కొనసాగించాలని తన సర్వీస్ వారితో కాల్చుకొని రాజంపేట్ మండలo శివాయిపల్లి గ్రామానికి చెందిన కానిస్టేబుల్ కిష్టయ్య తొలి అమరుడు ముదిరాజ్ అని కేసీఆర్ గుర్తు ఉంచుకోవాలని అన్నారు. రాష్ట వ్యాప్తంగా 65 మంది ముదిరాజులు తెలంగాణ ఉద్యమంలో బలి అయ్యారని పేర్కొన్నారు. అలాంటి మా జాతికి బీఆర్ఎస్ పార్టీ ఒక్క ఎమ్మెల్యే టికెట్ కేటాయించకుండా జాబితాని విడుదల చేస్తూ ఎన్నికల పోవడం దారుణమని పేర్కొన్నారు.. 56 లక్షల ఓట్లున్న ముదిరాజులు ఎలాంటి రాజకీయ టికెట్ లేకుండా 21 నియోజకవర్గాల్లో స్వతహాగా గెలిచే సత్తా ఉందన్నారు.. మరో 29 నియోజకవర్గాల్లో గెలుపోటములను నిర్ణయించే బలమైన ఓటర్లు కలిగిన బలమైన జాతి ముదిరాజ్ జాతి అని పేర్కొన్నారు.. మా ఆత్మగౌరవానికి భంగం కలిగిందని గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రతి ముదిరాజు ఇంటి నుండి ఇద్దరు చొప్పున తరలిరావాలని పిలుపునిచ్చారు లక్ష మందితో జిల్లా కేంద్రం కామారెడ్డి లో భారీ ర్యాలీ నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు… బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఓటు వేసి కేసిఆర్ ను ఇంటికి సాగనంపుతామని హెచ్చరించారు.ఇట్టి కార్యక్రమం లో రాజంపేట్ ముదిరాజ్ సంఘము అధ్యక్షులు బండారి చంద్రయ్య ‘కార్యదర్శి గజ్జెల రాజు కుల పెద్ద మనుషులు మరియు ముదిరాజ్ కుల యువకులు సభ్యులు పాల్గొన్నారు.




