ఘనంగా శ్రీ జైన్ శ్రేతాంబర్ తెరపంత్ సభ

సికింద్రాబాద్ ఆర్ సి జనం సాక్షి సెప్టెంబర్ 19
సికింద్రాబాద్ లో రాజరాజేశ్వరి గార్డెన్ లో ప్రత్యేక శ్రీ జైన్ శ్రేతాంబర్ తెరపంత్ సభ ఘనంగా నిర్వహించారు.జైన్ సమాజం లో ప్రతి ఏటా జైనులు తమ ఆత్మశుద్ధి కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జైనులంతాఉపవాస దీక్షలలో చివరి రోజు కావడంతో జైనులు పెద్ద ఎత్తున తెరపంత్ సభ కు హాజరై ఉపవాస దీక్షలు విరమించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జైన మత గురువైన సాద్వి శ్రీ మంగల్ ప్రగ్యా పాల్గొని ఉపన్యాస ప్రవచనాలు ఇచ్చారు.ఆచార్య సాద్వి శ్రీ మంగల్ ప్రగ్యా మహాశ్రమన్ గురు ఆయనకు శిశు బృందం 700 మంది 2022లో మహారాష్ట్ర నుంచి ఆచార్య సాద్వి శ్రీ మంగల్ గురు బొంబాయి నుంచి నగరానికి చేరుకున్నారు, అదే కోవిడ్ సమయంలో 2022 పటేల్ అనే వ్యక్తి శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో జైన్ లు ప్రార్థన చేసుకుంటానికి 25 ఎకరాల స్థలాన్ని ఐదో నెల ఉచితముగా లోక కళ్యాణార్థం,జప,ఉపవాస దినోత్సవం సందర్భంగాఆరోజు నగరంలోఉన్న 1700 కుటుంబాలు ఏకమై శంషాబాద్ ప్రాంతాల్లో పర్వదినాన్ని కొనసాగించారు,రాష్ట్ర ముఖ్య అతిథిగా విచ్చేసిన మహా శ్రమన్ విచ్చేశారు సాద్వి ధర్మాన్ని స్వీకరించిన డాక్టర్ ఆచార్య సాద్వి శ్రీ మంగల్ ప్రగ్యా ప్రపంచంలో 25 దేశాల లో ధర్మాన్ని వివరిస్తూ చుట్టు ముట్టారు. గతంలో వైస్ ఛాన్స్లర్ హోదా లోబోధించారు.ఏడు రోజులకు ఉపవాస దీక్ష ఈరోజు ఆఖరి దినం, ఉపవాస దీక్షలో ఒకరోజు తిని మరొక రోజు తినకుండా నిబంధనలతో చిన్న పెద్ద తేడా లేకుండా రోజులు నెలలు పక్కకు పెట్టు జైన్ లు ఉపవాస దీక్షలో జప దివస్ లోభాగంగా వారం రోజులపాటు కఠిన ఉపవాస దీక్షలను చేయనున్నట్లు జైన్ సమాజ్ అధ్యక్షుడు బాబు లాల్ తెలిపారు.జైన్ సమాజం మానవ విలువలను శాంతి కోసం పరితపిస్తుందని అన్నారు.తాము చేసిన పొరపాట్లను సరిదిద్దుకునే క్రమంలో భగవంతునితో క్షమాపణ కోరుకుంటామని అన్నారు.ధ్యాన్ దివస్ కార్యక్రమంలో భాగంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల నుండి బయటపడడంలో ధ్యానం ఏకాగ్రత కు ప్రత్యేక స్థానం ఉందని ఆమె తెలిపారు. సమస్యలకు పరిష్కార మార్గం కోసం ధ్యానం చేయడం ఉత్తమ సాధనమన్ని పేర్కొన్నారు.లోక కళ్యాణార్థం ప్రపంచశాంతి కోసం జైన సమాజం ఏడు రోజులపాటు ప్రత్యేక పూజలు నిర్వహించి చివరి రోజున ఉపవాస దీక్షలు విరమించినట్లు తెలిపారు.
కార్యక్రమంలో జైన్ సమాజ్ అధ్యక్షుడు బాబూలాల్, కోశాధికారి ముఖేష్ జైన్ తో పాటు పలువురు పాల్గొన్నారు.. ఈ కార్యక్రమంలో జైన్ సమాజ అధ్యక్షుడు బాబులల్ బైడ్,సెక్రటరీ సుశీల్ సన్ శెట్టి, కోశాధికారి ముఖేష్ చొరరియా, ఉపాధ్యక్షులు హిమాన్షు,నవీన్,సంయుక్త కార్యదర్శి రాకేష్ సురాన,ధర్మేందర్ , కార్యనిర్వాహక కార్యదర్శి నార్తన్, సలహాదారులు లక్ష్మి పట్ భేద్,లలిత్ భేధ్,నవీన్ దశని,లలిత్ కుమార్ బైడ్ తదితరులు జైన్ పెద్ద సంఖ్యలో ఉపవాస దీక్ష లో పాల్గొన్నారు.