మహిళా బిల్లు ఆమోదకరం సంతోషకరం.
నియోజకవర్గ జాగృతి కన్వీనర్ దత్తాత్రేయ.
తాండూరు సెప్టెంబర్ 19(జనంసాక్షి)పార్లమెంటు మరియు శాసనసభల్లో 33శాతం మహిళా రిజర్వేషన్ కు ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వం ఎదగాలని ప్రయత్నం చేస్తున్న మహిళలకు మంచి అవకాశ మని జాగృతి కన్వీనర్ దత్తాత్రేయ అన్నారు.మా కవితక్క అనుకున్నది సాధించిందని సంతోషం వ్యక్తం చేశారు, మహిళా సాధికారత దిశగా ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు ఒక వరంగా మారనుందని, ఈ సందర్భంగా ఆయన మహిళా నాయకురాలు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఎంతో పోరాటం చేసిన కవితక్కకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు..తండ్రి కేసీఆర్ నేర్పిన పోరుబాటలో అడుగులు వేసిన కవితక్క , తండ్రి తెలంగాణ సాధించి ప్రజల గుండెల్లో నిలిస్తే, కూతురు కవితక్క మహిళా రిజర్వేషన్ కై గల్లీ నుండి ఢిల్లీ దాకా పోరాటం చేసి ఈరోజు మహిళా రిజర్వేషన్ బిల్లు సాధించి యావత్ భారత మహిళల గుండెల్లో చిరస్థాయిగా నిలిచర ని తాండూర్ నియోజకవర్గం జాగృతి కన్వీనర్ దత్తాత్రేయ జాగృతి తరపున శుభాకాంక్షలు తెలిపారు.




