Thursday, 5 November 2026

మహిళా బిల్లు పై హర్షం వ్యక్తం చేసిన బీజేపీ మహిళా మోర్చా

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిసిన మహిళా మోర్చా నేతలు.

వనపర్తి బ్యూరో సెప్టెంబర్19 (జనంసాక్షి)

ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన క్యాబినెట్ లో మహిళా బిల్లు ను ఆమోదించటo పై మహిళా మోర్చా అధ్యక్షురాలు వారణాసి కల్పన హర్షం వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ చారిత్రకమైన నిర్ణయాలను నరేంద్ర మోడీ తీసుకుంటారని ఆయన అధికారంలోకి వచ్చినప్పుడే మహిళా బిల్లు అమల్లోకి వస్తుందని ఆశాభావం ఉండేదని అది మోడీ సార్ధకం చేశారని ఆమె పేర్కొన్నారు. రెండు దశాబ్దాలకు పైగా పెండింగ్లో ఉన్న బిల్లు మోడీ హయాంలోనే సాధ్యమైందని ఈ బిల్లుతో మహిళలు కూడా రాజకీయ రంగంలో ముందు ఉంటారని మహిళా సాధికారిక సాధ్యమవుతుందని మహిళా బిల్లు ఆమోదం పొందటం దేశానికే గర్వకారణం అని ఈ బిల్లుకు మోడీ నారిశక్తి అని నామకరణం చేయటం సంతోషమని మహిళలందరూ తరఫున కృతజ్ఞతలు తెలియ జేశారు. బిల్లును లోకసభ లో అన్ని పార్టీలు మద్దతు తెలిపాలని ఆమె కోరారు. అనంతరం మహిళా కార్యకర్తలు మహిళలకు స్వీట్లు పంచుకొని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు బచ్చు రాము గారు మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి కవిత ఉపాధ్యక్షురాలు సుమిత్రమ్మ పద్మమ్మ ,సూగురు లక్ష్మి, సరోజ, నిరీష ,భవాని, శిరీష సుగురు రాము సిత్తారి ప్రభాకర్ గారు జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు