బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నేత సెగ్గం రాజేష్
జనంసాక్షి , మంథని : పెద్దపల్లి జిల్లా
మంథని మండల కాంగ్రెస్ పార్టీ తాజా మాజీ అధ్యక్షులు సెగ్గం రాజేష్ మంగళవారం హైదరాబాద్ లో పెద్దపల్లి జడ్పీ చైర్మన్ మంథని నియోజకవర్గ ఇన్చార్జి పుట్ట మధుకర్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ లో చేరారు. వీరికి కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సెగ్గం రాజేష్ అతనితో పాటు పలువురు కార్యకర్తలు టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.




