సమస్యాత్మక ప్రాంతల పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలి.

నేర నియంత్రణ పై వీడియో కాన్ఫరెన్స్
తెలంగాణ రాష్ట్ర డిజిపి అంజనీ కుమార్
వనపర్తి బ్యూరో సెప్టెంబర్ 19 (జనంసాక్షి)
తెలంగాణ రాష్ట్ర డిజిపి అంజనీ కుమార్ పోలీసు కమిషనర్లకు, జిల్లాల ఎస్పీలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నెల వారి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల సందర్భంగా పోలీస్ అధికారులు, సిబ్బంది గ్రామాల పరిధిలో ముందస్తు భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. సమస్యాత్మక గ్రామాలను సందర్శించాలనీ సూచించారు. రౌడీలు, కెడిలు ,సస్పెక్ట్ ల పై నిఘా ఏర్పాటు చేయాలని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణ కై పోలీస్ శాఖ చేసే కృషి ఆయా ప్రాంతాల అభివృద్ధికి కారణమవుతుందని డీజీపీ అన్నారు. రాష్ట్రంలో ప్రతి పోలీస్‌స్టేషన్‌లోని అధికారులు సిబ్బంది ప్రత్యేక శ్రద్ధతో పని చేయడం వలన నేరాల నిరోధన, నేర పరిశోధన, న్యాయస్థానంలో శిక్షల ఖరారు చేయడం జరుగుతుందని తెలిపారు. వర్టికల్స్ వాటి పనితీరు, హెచ్ ఆర్ ఎం ఎస్ వినియోగం, నేరాల వివరాలను ఆన్లైన్లో నమోదు, పెండింగ్ కేసులు మొదలగు విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ రక్షిత కే.మూర్తి, మాట్లాడుతూ. రాబోయే శాసనసభ ఎలక్షన్ల సందర్భంగా జిల్లా పరిధిలో శాంతి భద్రతలు పరిరక్షించడానికి కృషి చేస్తున్నామని, పోలీసు అధికారులు, సిబ్బంది పోలింగ్ స్టేషన్లను, సమస్యత్మక గ్రామాలను సందర్శించి సమస్యలు తెలుసుకోనీ ప్రజలతో మమేకం అవుతూ సంబంధిత అధికారులతో కలిసి పనిచేయడం జరుగుతుందని ఎస్పీ గారు తెలిపారు. గత ఎలక్షన్ల సమయంలో సమస్యలు సృష్టించే వారి పై జిల్లా పరిధిలో రౌడీలు, కేడీలు, సస్పెక్ట్ ల పై పూర్తి నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే జిల్లాలో పెండింగ్ కేసులను కోర్టు అధికారుల సమన్వయంతో పెండింగ్ కేసులు పూర్తి చేయడానికి నిత్యం కృషి చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో పోలీసు అధికారులకు, సిబ్బందికి నిరంతరం ట్రైనింగ్స్, వర్క్ షాప్స్ నిర్వహించడం జరుగుతుంది అని తెలిపారు. ప్రజలకు షి టీమ్స్ ద్వారా సైబర్ నేరాలు, పోలీస్ చట్టాలు, ట్రాఫిక్ రూల్స్, మూఢనమ్మకాలు, బాల్యవివాహాలు, సి ఈ ఐ ఆర్ నూతన అప్లికేషన్ మొదలగు విషయాలపై అవగాహన సదస్సు నిర్విస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లి వనపర్తి డిఎస్పీ ఆనంద రెడ్డి , వనపర్తి స్పెషల్ బ్రాంచ్ సిఐ మధుసూదన్ ,సైబర్ క్రైమ్ సీఐ శ్రీను డిసిఆర్బీ ఎస్సై సంతోష్ ఐటీ కోర్ హెడ్ కానిస్టేబుల్ గోవిందు సిబ్బంది పాల్గొన్నారు.
పి.ఆర్.ఓ.రాంచందర్ లు పాల్గొన్నారు.




