Thursday, 5 November 2026

తడకమళ్ల – తాళ్లగడ్డ రోడ్డును మరమ్మత్తు చేయించండి.

ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం సమర్పించిన సిపిఐ నేతలు.

మిర్యాలగూడ, జనం సాక్షి.

తడకమళ్ళ నుండి తాళ్లగడ్డ వెళ్లే రహదారి పూర్తిగా గుంతల మయమైందని సిపిఐ మిర్యాలగూడ మండల సమితి ఆధ్వర్యంలో ఆర్ డి ఓ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తడకమళ్ళ బైపాస్ దగ్గర నుండి తాళ్లపల్లి బ్రిడ్జి వరకు 15 నుండి 20 ప్రాంతాలలో గుంతలు ఏర్పడ్డాయని వెంటనే స్పందించి పాత రోడ్డుస్థానం లో కొత్త రోడ్డు వేయించాలని బంటు వెంకటేశ్వర్లు కోరారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి ఎండి సయ్యద్, గిరిజన సమైక్య జిల్లా కార్యదర్శి ధీరావత్ లింగా నాయక్, ఏ ఐ టి యు సి నాయకులు వల్లంపట్ల వెంకన్న, పల్లా మాధవి, గోపాల్ తదితరులు పాల్గొన్నారు