ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం.
మంత్రి పట్నం మహేందర్ రెడ్డి.
తాండూరు సెప్టెంబర్ 20(జనంసాక్షి) ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరం లాంటిదని మంత్రి పట్నం మహేందర్ రెడ్డి పేర్కొన్నారు.నిమ్స్ ఆస్పత్రిలో గత కొన్ని రోజులుగా అస్వస్థతతకు గురై చికిత్స పొందుతున్న తాండూరు పట్టణం లోని గొల్ల చెరువుకు చెందిన బుష్ రా బేగం కుటుంబ సభ్యులకు ఆమెచికిత్స కోసం రూ. 2.50 లక్షల ఎల్ఓసీని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు మరియు గనుల శాఖామంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో
వార్డ్ కౌన్సిలర్ రాము ,నాయకులు షేక్ మక్సూద్ పాషా, ముక్తార్ హుస్సేన్, షేక్ మన్సూర్ పాష, జహీర్ భాషా తదితరులు పాల్గొన్నారు.




