అన్నిదానాల కన్నా అన్నదానం మిన్న…
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): అన్నిదానాల కన్నా అన్నదానం మిన్న అని మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని 43వ వార్డ్ నెహ్రూ నగర్ లో వీఆర్ఎస్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మంటపం వద్ద గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేముల షణ్ముక్ పుట్టినరోజు సందర్భంగా వేముల వీరబాబు మల్లీశ్వరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఏడేళ్లుగా వీఆర్ఎస్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం అభినందనీయం అన్నారు. గణపతి నవరాత్రోత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ బత్తుల ఝాన్సీలక్ష్మి రమేష్ , మాజీ కౌన్సిలర్లు జ్యోతి కరుణాకర్ , బైరబోయిన శ్రీనివాస్, బత్తుల రమేష్, బత్తుల వెంకటయ్య, మల్లీశ్వరి,
వార్డు బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి మీనయ్య, యూత్ అధ్యక్షులు మక్కల శంకర్, ప్రధాన కార్యదర్శి మక్కల రవి, కుంచం దుర్గారావు, గుంజ ప్రవీణ్, బత్తుల గోపి, మక్కల రవిచంద్ర, మోహన్, రఘు, వెంకటేష్, బాలు, పవన్ కళ్యాణ్, సాయికిరణ్, మణికంఠ, సాయి తదితరులు పాల్గొన్నారు.




